7, మార్చి 2019, గురువారం

ఏడవటం నా జన్మహక్కు

పిల్లవాడు పుట్టి పుట్టగానే ఏడవకపోతే, గిల్లి ఏడ్పించేవారు. ఇప్పటికి ఇది ఆచరణలో ఉన్న వ్యవహారమే. ఇది శిశువు ఆరోగ్యంగా పుట్టాడా లేదా అని తెలుకోవడానికి చేసేవాళ్ళు. క్రమేణా వాడు పెద్దవాడయ్యే క్రమంలో ఏడుస్తూ, నవ్వుతూ ఇవి రెండు కాకుండా బ్రహ్మనందాన్ని ఎలా పొందాలి అన్న దిశగా ప్రయాణం చేస్తాడు అని ఆశించేవారు. కాస్త విషయపరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా బ్రతకాలని, లేకపోతే అధమం సంతోషంగా అయినా ఉండాలని కోరుకుంటారు. కనీసం గతంలో ఇలా జరిగేదని మనకున్న వాఙ్మయం చెబుతోంది. మారుతున్న పర్యావరణం, కాలంతో పాటు మనిషి పెడబుద్ధి కూడా రూపాంతరం చెందుతున్నట్టు అనిపిస్తుంది. మార్పు సహజము లేదా సహజమైన మార్పుని ఆహ్వానించవలసిందే.  కానీ అవాంఛితమైన మార్పు, విపరీత ధోరణులు ఎవరికి అభిలషణీయం కాదు.

నేను మాట్లాడుతున్న అసహజమైన మార్పు "ఏడుపు" గురించి. ఏదో బాధ, ఒక దుఃఖం కలిగించే సంఘటనో, అనారోగ్యం, దగ్గర మనుషులలో లేక వాళ్ళతో అశాంతి ఉండి, ఎవరైనా ఏడిస్తే అది అత్యంత సహజం. అటువంటి వాళ్లకి ఓదార్పు మాటలు చెప్పటమో,  సానుభూతి చెయ్యటమో, మనకి చేతనయినా సాయం ఏదైనా చేయటానికి ప్రయత్నం చేస్తాం. కానీ అయినదానికీ, కానీదానికి ఏడుపు అనే భావప్రకటన చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. నన్ను తిట్టావు ఏడుస్తాను, మా హీరోని తిట్టావు ఏడుస్తాను, మా నాయకుడిని తిట్టావు ఏడుస్తాను. నువ్వు నాకంటే బాగా చదువుతావు ఏడుస్తాను, నువ్వు నాకంటే బాగా వ్రాస్తావు ఏడుస్తాను, నువ్వు నాకంటే అందగాడివి ఏడుస్తాను, నువ్వు నాకంటే బాగా పాడతావు ఏడుస్తాను. అంటే సమస్య ఏదైనా, నచ్చనిది ఏది కనిపించినా సమాధానం ఏడుపే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ధోరణి ఇంకా ఎక్కువగా ఉంది. నాకు భావప్రకటనా స్వేచ్ఛ ఉంది, నామాట సులభంగా అందరికి చేరుతుంది కదా అని ఏదైనా అంటాను అన్న దృక్పథం మెండయింది. అంటే ఈతరహా జనాలకి ఏడవటం జన్మహక్కు అయికూర్చుంది. 

పూర్వం పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పెద్దలు దండించేవాళ్లు. ఇందులో విశేషం ఏమిటంటే పెద్దలు ఎవరైనా  కావచ్చు. తల్లితండ్రులు, ఇరుగు పొరుగు, గురువులు, ఊళ్ళో పెద్దలు ఇలాంటి వాళ్లు అన్న మాట.  ఈవిషయంలో మాఇంట్లో వాళ్ళు ఇంకాస్త ముందుకెళ్ళి మాగురించి (పిల్లలం) ఏ ఫిర్యాదు వచ్చినా ముందు మమ్మల్ని దండించి తర్వాత ఏమి జరిగింది అన్నది విచారణ చేసేవాళ్ళు. మాకు ఉక్రోశం,ఎంత బాధ కలిగినా అసలు అటువంటి పరిస్థితిలో ఇరుక్కునందుకు మమ్మల్ని మేమే నిందించుకొని ఊరుకొనేవాళ్ళము. ఒక్కొక్కసారి పిల్లవాడికి సంబంధం లేకపోయినా కొట్టవలసి వచ్చిందని పెద్దలు నొచ్చుకొనేవారేమో! ఇలా ఎందుకు చేసేవారో పెద్దయిన తర్వాత కానీ మాకు అవగాహనలోకి రాలేదు. అంటే చెడు ఆలోచనని ఆదిలోనే త్రుంచేయ్యాలి అన్నది అప్పటి పెద్దల తపన, దానికి అనుగుణంగానే పిల్లలు వృద్ధిలోకి వచ్చారు. సంపాదనలు విపరీతంగా లేకపోయినా, భయం భక్తి ఉండి సంఘవిద్రోహులు కాకుండా మిగలగలిగారు. కానీ పరిస్థితులు ఎంతగా మారిపోయాయి అంటే మొత్తం పద్ధతులన్నీ తలక్రిందులయ్యాయి.

ఎవరు ఇంకొకరిని ఏమి అనటానికి లేదు. పెద్ద చిన్న, మంచి చెడు విచక్షణ లేదు. చెప్పేవాళ్ళు తగ్గారు, చెబితే విని ఆచరణలో పెట్టె వాళ్ళు తగ్గారు. ఇప్పుడు అన్నిచోట్లా మంచి చెప్పటం కూడా తప్పే. మేష్టారుగారు పిల్లవాణ్ని తిట్టినా, దండించిన ఆయనకే అక్షింతలు. కొన్ని చోట్ల కేసులు, ఉద్యోగం ఊడపీకడం, మరికొన్ని చోట్ల తల్లితండ్రులో బందుగులో చేయి చేసుకోవటం, జైళ్ల పాలు కావటం, సంసారాలు విచ్చిన్నం కావటం తరచూ జరుగుతోంది. పశ్చిమ దేశాల పద్ధతులు యెంత మాత్రం అర్థం చేసుకోకుండా దిగుమతి చేసుకుని అమలు చేయటం ఎక్కువ అయిపొయింది. అందరి హక్కులు కాపాడాలి అని బాధ్యతలకు, కర్తవ్యాలకి తిలోదకాలు ఇచ్చేసాము. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు, ఇతర ఉన్నత సంస్థలు "మంచిని చెయ్యి" అని చెప్పే నైతికతని నెమ్మదిగా కోల్పోతున్నారు.  అంటే అంతా పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని అనుకొంటే అది కూడా తప్పే.

ఇంతకీ ఏడుపు దగ్గర మొదలెట్టా కదా! దేశభక్తి, నైతికత, నాయకత్వం, సమర్థత, సమభావన, కర్తవ్యదీక్ష కలిగిన వ్యక్తులు ఇంకా భారత భూమిలో పుష్కలంగా ఉన్నారు. పేర్లు కావాలనే చెప్పట్లేదు. అవసరం కూడా లేదు. ఇప్పటి తరంలో మీకు కనిపించక పోతే బాగా వెతకండి. వాళ్ళు మన మధ్యనే సామాన్యుల్లా బ్రతుకుతున్నారు. మన సమకాలీకులని, గొప్పవారిని ఎలాగూ గుర్తించము కనక, కనీసం మన ముందు తరాల్లో ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాము. మన జీవితాలని ఉద్దీపనం చేసుకుందాము. అసలైన, సరైన సమస్యలను ఎదుర్కొనే, పోరాడే శక్తిని ఇవ్వమని ఏడుద్దాము, ప్రార్థిద్దాం. అక్కరలేని, మనకు సంబంధం లేని వాటి జోలికి వెళ్ళవద్దు. అంతేకాని మంచి చెప్పే ఉన్నతమైన వ్యక్తులని చూసి ఏడవటం, వాళ్ళని ఏడిపించటం మానేద్దాము. వాళ్ళు చెప్పినది మనకి నచ్చకపోతే మౌనంగా ఉందాము అంతే కానీ ఏడిస్తే అది మనకి సాయం చేయకపోగా అనారోగ్యం పాలుచేస్తుంది అన్నది గ్రహిద్దాము.

మంచిని ప్రోత్సహిద్దాము, అది చెప్పే పెద్దలని గౌరవిద్దాము, తద్వారా మనల్ని గౌరవించుకొందాం, వారి ద్వారా అందరు కోరుకొనే గొప్ప సమాజాన్ని నిర్మించుకొందాము. సర్వేజనా సుఖినోభవంతు!!!

తోక:- ఈమధ్యన ఒక పెద్దమనిషిని మరో అణువంతమనిషి అనకూడని మాటలనటం నా ఏడుపుకి కారణం. 

29 కామెంట్‌లు:

  1. ఎన్నాళ్ళకి రాశారండి, అన్యగామిగారు! బావుంది మీ బ్లాగున ఈ ఆరున్నొక్క రాగ సంకీర్తనం :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలిత గారు, అప్పుడప్పుడైనా ఏదైనా రాగం పాడుకోవటం మంచిది కదండీ! ధన్యవాదాలు.

      తొలగించండి
  2. అణువంతమనిషి.....

    మీ అహంకారం ఇక్కడే తెలుస్తుంది. విమర్శిస్తే అణువంతా ? విమర్శించకపోతే "గాంధీ"నా ? ఎవరెన్ని ఏడుపులు ఏడ్చినా "నిజం" ఏడవదు.

    రిప్లయితొలగించండి


  3. ఎవరెన్ని యేడ్పు లేడ్చిన
    జవరాలన్ చెప్పెదను నిజమ్మది యేడ్చే
    యువిదయె కాదోయి సుమా
    యెవడా మడిసి యణువంత యెర్రోడు సుమా :)


    నారదా!
    జిలేబి

    రిప్లయితొలగించండి

  4. # అన్యగామి గారు

    మీ బ్లాగ్ పోస్టులు అప్పుడప్పుడు మాత్రమే ప్రత్యక్షమవుతూ చమక్కుమనిపిస్తుంటాయి. వెల్కం బాక్.
    ------------
    మా హీరోని కామెంట్ చెయ్యడానికి నీ స్థాయి ఏంది, అసలు నీ స్ధాయి ఏందిరా అంటూ సోకాల్డ్ "అభిమానులు" వాళ్ళ హీరో మీద ఈగ వాలనివ్వకుండా ఎదుటివాడి మీద విరుచుకుపడి దాడి చేసే ధోరణి పెచ్చుమీరిపోతోంది. ఒక పెద్దమనిషిని మాటతూలడం కూడా అటువంటి "అణువంత" మనుషుల దురుసుతనం బాపతే.
    ------------
    // "పెద్దలు ఎవరైనా కావచ్చు. తల్లితండ్రులు, ఇరుగు పొరుగు, గురువులు, ఊళ్ళో పెద్దలు ఇలాంటి వాళ్లు అన్న మాట." //. మాబాగా చెప్పారు 👌. తల్లిదండ్రుల యొక్క సన్నిహితులు కూడా అటువంటి పెద్దలే. పిల్లలు తప్పు దిశగా వెడుతున్నారు అనిపిస్తే శ్రేయోభిలాషులు మంచి చెప్పే బాధ్యత తీసుకునేవారు / చెప్పటానికి ప్రయత్నం చేసేవారు ... వారు తల్లిదండ్రులే కానక్కరలేదు. కానీ అదంతా ఒకప్పటి ప్రపంచం, సమాజం, విలువలు. మీరన్నట్లు ఇప్పుడు అసలు చెప్పేవారే తగ్గిపోతున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట వారు, ఎక్కడికి వెళ్ళలేదండి, బద్దకము మాత్రమే కారణం. ఎప్పుడైనా ఉత్సాహాం దానిని అధిగమిస్తే వ్రాస్తున్నాను. ధన్యవాదాలు.

      తొలగించండి
  5. పెద్దమనుషులు బూతులు వ్రాయడం ఏ "బాపతో"🐯 మరి ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారు, నేను అదే చెబుతున్నాను. సద్విమర్శ వ్యక్తిగతం కాకూడదన్నదే నావాదన. మీరు మరో సారి చదివి ఆలోచిస్తే నాకోణం అర్థం అవుతుంది. అప్పుడు కూడా మీ అభిప్రాయం అదే అయితే నేను సరిగ్గా చెప్పలేకపోయానేమో? ధన్యవాదాలు.

      తొలగించండి
  6. "ఈమధ్యన ఒక పెద్దమనిషిని మరో అణువంతమనిషి అనకూడని మాటలనటం నా ఏడుపుకి కారణం"

    నాకు ఈ మనుషులు ఎవరో & ఆ మాటలు ఏమిటో తెలీదు. కాకపొతే "అన*కూడని* మాటలు" అంటేనే *ఎవరూ* అనకూడదని అర్ధం కదా. మాటలే అనకూడనివయితే అన్నవారు & పడ్డవారిలో ఎవరు పెద్దలయినా ఎవరు అణువంటి వారయినా తేడా ఏమిటో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారు, మీరు బ్లాగ్లోకంలో లబ్దప్రతిష్టులు. మీకు చెప్పేంతటి వాడిని కాదు. ఏదైనా అనేముందు ఎంతమాట పడితే అంత మాట ఎదుటివారిని అనకూడదన్నదే నాతాత్పర్యం. అందుకు మీరే ప్రత్యక్ష ఉదాహరణ. I have not seen you losing balance in the most difficult circumstances when arguing over a serious subject. ధన్యవాదాలు.

      తొలగించండి
    2. "ఏదైనా అనేముందు ఎంతమాట పడితే అంత మాట ఎదుటివారిని అనకూడదన్నదే నాతాత్పర్యం"

      పూర్తిగా ఏకీభవిస్తాను. ఇందులో పెద్దాచిన్నా తేడాలు ఉండకూడదని మాత్రమే నా అభిప్రాయ బేధం. Just a minor difference of opinion.

      "మీరే ప్రత్యక్ష ఉదాహరణ"

      Thank you for the (undeserved) compliment sir.

      తొలగించండి

  7. ఇక్కడ యేదో మండుచున్నది :)

    ఆజ్యమేమైనను వలయునా :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. రంగస్థలం తెలుగు బ్లాగులోకమే ఐతే ,
    ఇక్కడ పెద్దమనిషి , అణువంతమనిషి _ అనే తేడా భావ్యంకాదు . అందరూ ఙ్ఞానవంతులే .
    కాకపోతే కొందరు తమను తాము ఎన్ సైక్ లో పీడియాలు
    గానూ , తప్పులు దిద్దడానికే పుట్టుకొచ్చిన పండితోత్తముండలుగాను , పరమ పావన సాంప్రదాయ పరాయణులుగానూ , ఎదుటివారిని బొత్తిగా తెలివిడిలేని
    అఙ్ఞాన ధురీణులుగా జమకట్టే మహాఙ్ఞానులుగానూ - భావించుకుంటూ ఉన్నారు . ఇది కుహనామేథావులకుండే జబ్బు . వీళ్ళకు పుస్తక ఙ్ఞానం తప్ప మస్తక ఙ్ఞానం సున్న .
    అందరికీ అన్నీ తెలియవన్న కనీసఙ్ఞానం లేని వీళ్ళు ఎవ్వరేదడిగినా ఠక్కున చెప్పేస్తుంటారు . నాబోటి వాళ్ళకు
    అది అనుభవంలోనిదై ఇది ఇదీ అని చెప్పినా , ఇగో ఉందిగా , అది ఒప్పుకోదు . ఏతావత్ , నేను చెప్పొచ్చే
    దేవిటంటే , ఇక్కడ అసమానతలు అవసరంలేదు . మాట తూలడమూ అవసరంలేదు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్కాకుల వారు, మీరు పెద్దలు, అనుభవజ్ఞులు. మీకిది కష్టం తోచటం నాకు తప్పనిపించలేదు. ఎవరిని నిందించడానికి కాకుండా, సంయమనం పాటించడానికి వ్రాసాను. గ్రహించగలరు. ధన్యవాదాలు.

      తొలగించండి
  9. మీరు రాసిందంతా బాగుంది గానీ మీరు చివరకు పెట్టిన తోకతో మీ హుందాతనాన్ని మీరే తగ్గించుకున్నారనిపిస్తోంది. ఏడవటానికి మీ జన్మహక్కును నేను కాదనను గానండి, పొంతన కుదరక మీ జెండా, ఎజెండా రెండూ తేలిపోయాయి అన్యగామి గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత, మీరు చెప్పినది నిజమే అనుకొంటాను. నేను పైన పేర్కొన్న ఏ పెద్దల జాబితాలోనూ లేను. మామూలు మనిషిని. నాఆవేశం తోకలో ప్రతిధ్వనించింది. ధన్యవాదాలు.

      తొలగించండి
    2. మీ ఆవేశం తోకలో ప్రతిద్వనించింది అని ఒప్పుకున్నారు. తప్పులు చేయకుండా ఎవరుంటారండీ ? నేను ప్రస్థావించిన పెద్దమనిషి తప్పు ఒప్పుకోకుండా అపర "గాంధీ" గా చలామణి అవుతున్నాడు.
      అందుకే ఆరున్నొక్కరాగం లో అటాక్...అటాక్!

      తొలగించండి


  10. ఈ కామింట్ల చదివే కొద్దికీ మరీ క్యూరియాసిటీ పెరిగి పోతోంది ! అయ్యయ్యో నాకు తెలీకుండా యేదేదో జరిగి పోతోందే ! ఎవరా పెద్ద మడిసి ? ఎవరా పుల్వంపు బుడత !

    తెలిసిన వారు వెంఠనే చెప్పాలె!

    వెంఠనే సస్పెన్సు నకు తెర దించుడు !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పుడూ అర్థం కాకుండా మాట్లాడుతారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండి బోనగిరి గారు, అర్థం చేసుకోవటానికి మనం ఇంకా ప్రయత్నం చేయాలేమో?

      తొలగించండి
  12. అన్యగామిగారు, చాలా రోజులకి మంచిటపా!!

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. ఈ కామెంటేదో రాజుగారి పెద్దభార్య సామెతలాగుంది :( అంతర్జాతీయ మహిళా దినం జిందాబాద్.

      తొలగించండి