23, జనవరి 2017, సోమవారం

మరో శకం

డోనాల్డ్ జాన్ ట్రంప్ 45వ దేశాధ్యక్షుడిగా మొన్న శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అభిమానులు, కుటుంబం, గతఅధ్యక్షులు వెంట ఉండగా ఉత్సవం అట్టహాసంగా జరిగింది.  ఒకవైపు సంబరాలు, మరో వైపు నిరసన సెగల మధ్య మరో శకం మొదలైయ్యింది. ఆమర్నాడే అమెరికా లోని మహిళాలోకం వాషింగ్టన్ డిసిలో పెద్ద సభ నిర్వహించారు. ఎందరో అభ్యుదయ మహిళలు, నాయకులూ ట్రంప్ పురుషాధిక్యతని , జాత్యాహంకారాన్ని ఖండిస్తూ  ఎన్నో తీర్మానాలు చేశారు. 

ఇవన్నీ చూస్తే ఎన్నికలముందు వీళ్లేందుకు సంఘటితంకాలేదు అన్న ప్రశ్న వస్తుంది. చాలా మంది ధిక్కారస్వరాలు వినిపించారు, కానీ అవిఅన్నీ ట్రంప్ కి వినిపించలేదు. మూడునెలల ముందరిదాకా గెలుస్తారని అనుకొన్న హిల్లరీ ఎలా ఓడిపోయారో, ఇన్ని అవగుణాలున్న ట్రంప్ ఎలా గెలిచారో పెరుమాళ్ళకెరుక. వీటి వెనక పెద్ద కుట్ర ఉన్నట్టుగా వినికిడి. ఇవన్నీ ఊహాగానాలే గాని ఎవరికి ఇతమిద్దంగా తెలియదు. అగ్రరాజ్య ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి అన్నది కుందేటికొమ్ములా తయారయ్యాయి. 

ఎందుకో మనుషుల్లో జంతు ప్రవృత్తీ  పూర్తిగా సమసిపోలేదనిపిస్తుంది. నాచుట్టూ ఉన్న జనాలని పరిశీలిస్తే, ముఖ్యంగా తెల్లవాళ్ళని. వాళ్ళల్లో ఎక్కువమందికి ట్రంప్ లో వాళ్ళ దైవం కనిపించేదేమో అనిపిస్తుంది. ఒకే సమాజంలో ఉండే సమాచార సాధనాల్లో ఒకే వార్తకి వీళ్ళు ఇంకోలా స్పందించటం చిత్రంగా ఉంది. ట్రంప్ స్వదేశిరక్షణ విధానాల్లో తప్పేమీలేదు. కానీ మాది తప్ప మిగిలిన జాతులన్నీ నిమ్నమైనవిగా బాహాటంగా ప్రకటిస్తే దానికి వీళ్ళు మద్దతు ఎలా ఇచ్చారో అర్థంగాదు. పైపెచ్చు వీళ్ళు మిగిలిన దేశాల వాళ్లకి నీతి సందేశాలు. 

తమిళనాట జల్లికట్టుకి చట్టబద్దత కల్పించేశారు. కేంద్రం మెడలు వంచారన్నారు, సినిమా హీరోలు సంఘీభావం తెలియచేసారు, మన సంస్కృతీ అన్నారు.  సినిమాల్లో జంతువులని వాడితే అహింసా మార్గంలో వాడాము అని  ధృవీకరణలు. బావుంది. మరి అన్ని జిల్లాల్లో సంస్కృతి పేరు చెప్పి అన్ని పదుల జీవాలని హింసించటాన్ని ఏమంటారు. పైపెచ్చు వీళ్ళని చూసి మన యువత ప్రత్యేక రాష్ట్ర ప్యాకేజి తెస్తామని విశాఖపట్టణంలో ఆందోళన మొదలెట్టబోతున్నారు. దీని వల్ల సామాన్యులకి ఇబ్బంది, కొంచెం తప్పుదారి పడితే వాళ్ళకి విద్యాసంవత్సరం పోవటం తప్ప ఏమొస్తుంది. నిజంగా చెయ్యగలిగినది ఎన్నికలలో అది తెచ్చే నాయకత్వాన్ని ఎన్నుకోవటం, అది వెంటనే కుదరదు కాబట్టి ఉన్న ప్రభుత్వం మీద వత్తిడి తెమ్మని స్థానిక నాయకులని ముందుకు తోయడం తప్ప. 

5 కామెంట్‌లు:

  1. నారాయణ ! సత్య నారా యన్నా :)

    రిప్లయితొలగించండి
  2. <"ఎందుకో మనుషుల్లో జంతు ప్రవృత్తీ పూర్తిగా సమసిపోలేదనిపిస్తుంది. నాచుట్టూ ఉన్న జనాలని పరిశీలిస్తే,"
    జంతు ప్రవృత్తి, ఆటవికం ఎక్కువవుతున్నాయని నా అభిప్రాయం అన్యగామి గారు.
    మీ దేశంలో మొన్న 20 నాటి ప్రారంభం మీరన్న మంచి "మరోశకం" కి నాంది అవుతుందని ఆశిద్దాం.
    మీ బ్లాగ్ దినదిన ప్రవర్ధమానం అవాలని నా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. అన్నిట్లో జంతువుల్ని వాడడం నిషేధించినా, గుళ్ళల్లో ఏనుగులు వాడకం ఆగట్లేదేమిటి చెప్మా?

    రిప్లయితొలగించండి
  4. ఆలోచించదగిన ప్రశ్న.ఈ వాడకం కేరళాలో ఎక్కువ - సంప్రదాయం పేరిట.

    రిప్లయితొలగించండి