16, జనవరి 2017, సోమవారం

చిరు విజ్ఞప్తి

చిరు విజ్ఞప్తి: బ్లాగును చదివే విధంగా తయారుచేయటం ఎలా?

మీలో అందరు సాంకేతిక నిపుణులు అవ్వొచ్చు కాక పోవచ్చు. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చెయ్యటం ద్వారా మీ బ్లాగ్ ని ఎక్కువ మంది సులభంగా చదివి ఆనందించే వీలుంటుంది (ప్రత్యేకంగా - readability). సహృదయులైన బ్లాగరులు వీటిని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. రెండో బ్లాగులోనే సలహాలకి వచ్చేసాడా అని పెదవి విరవవద్దు. నేను ఇంటర్నెట్ మొదలైన దగ్గరనుంచి అన్నింటిని ఫాలో అవుతున్నాను. 


1. ఫోటోలు, మిరుమిట్లుగొల్పే రంగులు, కదిలే బొమ్మలు, రకరకాల పరిమాణాల్లో ఖతులు (fonts) వాడండి కానీ దానివల్ల చదివేవాళ్ళకి కలిగే అసౌకర్యం గమనించండి. ఉదాహరణకి www.google.com సైట్ లో మీరు ఏది వెతికినా, అది చూపెట్టే వివరాలన్నీ విఫులంగాను, చాలా సులభంగాను ఒక్కసారిగా  కనిపిస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మీ బ్లాగ్ మార్పు చేసుకొంటే, మీరు వెనక్కి తిరిగి చూడక్కర లేదు. బాగా తయారుచేసిన సైటుని చూపడంలో ఉద్దేశం - ఎంత తక్కువ హంగులు చేస్తే అంత బాగా మీ వ్రాతలు స్పష్టంగా కనిపిస్తాయి అనేది సుస్పష్టం చెయ్యడానికి.  తెలుగు బ్లాగుల్లోనే మంచివి కొన్ని, చెడువి కొన్ని చూపెట్టొచ్చు. కానీ బావుండదని చెయ్యలేదు. 

2. మీరు వ్రాసిన దాంట్లో పస లేకేపోతే, చదివే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది నేను చెప్పే అవసరం లేదు. ఊరికే గుర్తు చెయ్యడానికి ఈమాట. నేను నాకోసం వ్రాసుకొంటున్నాను, అంటే మీకొక దణ్ణం. మీరు మీ కోసం అందరి కోసమంటారా, ఎంతో కొంత వాడిని, వేడిని, ప్రత్యేకతని చూపెట్టండి. 

3. కామెంట్స్ ఎవరు వ్రాయటం లేదని కొందరు బ్లాగర్లు బాధ పడుతున్నారు. మీరు బాగా వ్రాస్తూ ఇది జరుగుతోంది అంటే విచారించవలసిన విషయం. అటువంటి వారు కామెంట్స్ అందరూ చేయడానికి అనుమతిచ్చారో లేదో చూడండి, బ్లాగర్ లోను, వర్డుప్రెస్సు లోను మరి ఇతర బ్లాగ్స్ లో సరైన అనుమతులు ఇచ్చారో లేదో చూడండి. ఉదాహరణకి నేను బ్లాగర్ లో సభ్యుడిని అయితే అందులో కామెంట్స్ కి అడ్డంకి లేదు. అలాగే వర్డుప్రెస్సుకి విడిగా సభ్యత్వం ఉండాలి అందులో కామెంటడానికి. కొందరు google+ మెంబరు అయితేనే కామెంటనిస్తున్నారు.  moderation పెట్టుకొన్నపుడు ఇంకా అంతకంటే  జాగత్తలు అవసరం లేదని నా అభిప్రాయం. అందరిని కామెంట్ పెట్టనివ్వండి, వస్తే కామెంట్స్, లేదా చీవాట్లు. పోయేదేముంది?

ప్రస్తుతానికి ఇంతే. మళ్ళీ ఏదైనా కూడనిది చూస్తే దాని గురించి ఆలోచిస్తా. మీకేమైనా తోస్తే జత పరచండి.


17 కామెంట్‌లు:

  1. మిమ్మల్ని ఎక్కడో .....చూసినట్టు......ఎక్కడా???? :)

    రిప్లయితొలగించండి
  2. గురువు గారు, మీరు పసిగట్టేసారు. మీకు తెలుసున్నవాడినే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శుభం.

      మీరెవరో తెలిసినా నేను చెప్పను,ఇంగువ దాచగలమా? జిలేబి ఎవరో చాలా కాలం కితమే తెలిసినా చెప్పలేదే ఎప్పుడూ! ఎక్కడా!! చెప్పను కూడా!!! అదంతే.

      తొలగించండి
    2. సంగతంతయు దెలిసి లింగ భేదము నెరిగి
      దొంగ మామి కధ విప్ప ఏల సందియమయ్య
      (భంగమైనను వాక్కు సత్యమును వచియించి)
      దొంగ దొంగ యను జనుల బెంగ తీర్చుము స్వామి
      రంగ రంగా యని మిమ్ము వేడుకొనెద ...
      :) jk / jf
      లోల...

      తొలగించండి
    3. nmrao bandiగారు

      వద్దులెద్దురూ :) లోల ఒక సారికాదు రెండు సార్లు చెప్పాలి. jk,jf
      లోల! లోల!!

      తొలగించండి
  3. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, జనవరి 19, 2017 6:07:00 AM

    అంతా ఒకరే నేమో !
    సుంతయు దెలియుటయు లేదు , చూడుము ఫ్రెండూ !
    అంతయు దెలిసిన శర్మయు
    కొంతైనా విప్పరేల ? కూడదనేమో !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకున్నూ అదే డౌటు గురువు గారు.
      మామి, గామి ఒకరేనంటారా కొంపదీసి.
      శర్మ సార్ వారు మొత్తంగా అటు వేపు మొగ్గి పోయారు.
      "...వివరముల తెలుపను సభికులకు సుమ్మీ!
      మా వూరమ్మణివి లతాం
      గీ,విదురుడు మాట తప్పి గీరడు సుమ్మీ" ...
      చూశారుగా కుమ్మక్కు జరిగిపోయిందిక్కడ.
      సందేహం సశేషం (సీరియల్‌కదై) ...
      :)

      తొలగించండి
    2. రావుగారు, నేను మామి ఒకటి కాదు. లోల అన్నది ఏఅర్థంలో వాడారో తెలియచేయగలరు.

      లోలpermalink
      లోల : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 Report an error about this Word-Meaning గ్రంథసంకేతాది వివేచన పట్టిక
      సం. వి. ఆ. స్త్రీ.
      1. నాలుక;
      2. లక్ష్మి.
      విణ.
      1. మిక్కిలి యిచ్ఛ గలది;
      2. కదలునది.

      తొలగించండి
    3. లక్కాకుల వారు, పిడికిలి మూసివుంచితేనే మేజిక్ బాగా చేయగలమండి (sleight of hand).

      తొలగించండి
    4. అన్యగామి గారు,
      'అంతా ఒకరేమోనేమో!' అన్న సందర్భంలో సరదాగా
      వెలిబుచ్చిన స్పందనగా తప్ప దానికి ప్రత్యేక ఆపాదింపు
      విడిగా ఏమీ లేదండి. లోల అన్న పద ప్రయోగం కూడా
      గతంలో ఒకట్రెండు సార్లు lol పదాన్ని ఇంగ్లీష్ లో టైపు
      చేస్తే telugulo లోల అని రావడంతో అప్పుడప్పుడు సరదాగా
      ఆ పదాన్ని lol కు బదులుగా తెలుగులో ఆ విధంగా
      వాడటం జరుగుతోంది, అది కూడా గురువు గారు శర్మ గారు,
      జిలేబీ గారు, లక్కాకుల వెంకట రాజారావు గారు, విన్నకోట
      నరసింహ రావు గార్లతో స్పందించే సరదా వ్యాఖ్యానాల్లో మాత్రమేనండి.

      తొలగించండి
    5. nmrao bandiగారు,
      వెంకట రాజారావు . లక్కాకులగారు,
      మీరు నలుగురూ అంతా ఒకరికొకరు బాగా తెలిసినవారే!
      మీకు వారు తెలియనట్టు, నాకే తెలిసినట్టు....ఉన్నాం.
      సరదా మాటల్ని అంత తొందరగా అపార్ధం చేసుకునేవాణ్ణేంకాదులెండి :)
      మీది నడుస్తున్న చరిత్ర,నాది ముగిసిన కత
      __/\__

      తొలగించండి
    6. గురువు గారు,
      నమస్తే. మనందరం ఈ రచ్చబండ (బ్లాగ్లోకం)ఇంచుమించుగా ఒకేసారిగా పరిచయస్తులమే. ఈ బ్లాగుల్లోకి రావడం కూడా చాలా యాదృచ్చికంగా జరిగిందే. 2013 చివరి నెలల్లో దాకా బ్లాగులనేవి ఉన్నాయని కూడా తెలియదనే నా అజ్ఞానాన్ని పట్టించుకోవద్దని నా మనవి. ఎప్పుడో కాలేజీ రోజుల్లో కేవలం కొన్ని హిందీ సినిమా పాటల ట్యూన్లకు తెలుగు రూపం ఇవ్వడమొక్కటే నాకున్న పరిజ్ఞానం. మిగతా
      వ్యవహారమంతా జనవరి 1, 2014 తర్వాత,బ్లాగు మొదలెట్టాక, మొదలైందే. మీలాంటి పెద్దలతో చతుర సంభాషణ లాడినా అవి మీరందరూ కూడా సరదాగా, స్పోర్టివ్ గా తీసుకోవడం మీ మీ గొప్పతనానికి నిదర్శనం. మీ నలుగురి లాంటి ఉద్దండుల పరిచయ భాగ్యం కలగడం, తద్వారా జరుగుతున్న interactions ద్వారా ఎంతో కొంత జ్ఞానం సంపాదించడానికి నేను చేస్తున్న ప్రయత్నం సఫలీకృత మౌతుందని ఆశిస్తాను. మనందరిదీ నడుస్తున్న చరిత్రేనండి. మీతో కలిసి నడుస్తున్న ఈ మార్గపు నడక మరింత ప్రకాశవంతంగా ఉంటుందనడంలో నాకు ఏ సందేహం లేదు.
      కృతజ్ఞతలు ...
      అందరికీ ...
      అంతటికీ ...
      ___/\___ ...

      తొలగించండి
  4. వేరే పనుల వల్ల ఓ రెండు మూడు రోజుల నుంచి బ్లాగుల వైపు రావడానికి కుదరలేదు. చాలా పోస్టులు, వ్యాఖ్యలు దాటిపోయినట్లున్నాయి.
    అన్యగామి గారు మామి గారు ("జిలేబి") ఒకరు కాదనే అనిపిస్తోంది. ఈ మధ్యనే ఒక బ్లాగులో (పేరు గుర్తు రావడంలేదు) సంక్రాంతి గురించి అన్యగామి గారు చేసిన వ్యాఖ్య బట్టి వారు అమెరికా నివాసి అనిపించింది. మరి "జిలేబి" గారు సింగపూర్ వాస్తవ్యులని తనే ఓ చోట చెప్పుకున్నారు కదా. QED.
    "బ్లాగు యుగంధర్" (మీకు మరొక బిరుదు తగిలించినందుకు మన్నించాలి శర్మ గారూ) శర్మ గారి దగ్గర దీనికి భిన్నంగా ఏదైనా వేరే సమాచారం / ఋజువులు ఉన్నాయేమో? పైగా లింగభేదం కూడా ఉన్నట్లున్నదిగా? బండి వారు అన్నట్లు "లోల" 🙂.

    రిప్లయితొలగించండి
  5. రావుగారు, thank you for explaining LOL (:-

    విన్నకోట వారు, మీరు అపరాధపరిశోధకులని తెలియదు. నేను అమెరికా వాస్తవ్యుణ్ణే. ఇకముందు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటా (:-

    రిప్లయితొలగించండి