26, అక్టోబర్ 2017, గురువారం

కొన్ని నిజాలు/అబద్దాలు?

శ్రీరామాయణంలో రాముల వారు అరణ్యానికి బయలుదేరే సమయంలో ఒక చిన్న విశేషం గురించి చెప్పుకుందాము. దశరథుడు రాముణ్ణి అడవికి వెళ్ళొద్దని పలు విధాలుగా ప్రాధేయపడతాడు. రాముడు తండ్రికి నమస్కరించి, మీ మాటని ఆచరణలో పెట్టడమే నా ధర్మమని చెప్పి సెలవు తీసుకొని అంతఃపురంలోంచి బయలు దేరుతాడు. బయటికి వచ్చి సుమంతుణ్ణి రథాన్ని తీసుకు రమ్మని, సీతాలక్ష్మణులతో కలసి రథంలో బయలుదేరుతాడు. ఇంతలో దశరథుడు మేడమీది నుంచి రాముణ్ణి వెళ్లవద్దని కోరుతాడు. అలాగే సుమంతుణ్ణి రథం ముందుకు తీసుకువెళ్ళద్దని ఆజ్ఞాపిస్తాడు. అయితే రాముడు ముందుకే రథాన్ని నడపమని సుమంతుడికి చెప్తే, సుమంతుడు అలా చేస్తే రాజాజ్ఞని ధిక్కరించినట్టవుతుందని రాముడికి చెబుతాడు. రాముడు రథచక్రాల ధ్వనిలో రాజు మాట వినిపించలేదని చెప్పమని చెబుతాడు. సుమంతుడు అది అబద్దం చెప్పటం కాదా అని ప్రశ్నిస్తే, రాముడు ఒక పెద్ద సత్యాన్ని కాపాడటం కోసం ఒక చిన్న నిరపకారమైన అబద్దం చెప్పటం తప్పు  కాదని చెబుతాడు. ఇది త్రేతాయుగపు ధర్మసూక్ష్మం.  

మహాభారతంలో కురుక్షేత్రంలో యుద్ధం హోరాహోరీగా జరుగుతోంది. గురుదేవులు ద్రోణుల వారి స్వైర విహారానికి పాండవుల పనుపున పోరాడుతున్న వీరులు పిట్టలలా నేల కూలుతున్నారు. ఆయనని నిలువరించడం ఎలాగో పాండవులకు అర్థం కాలేదు. మాములుగానే తరుణోపాయం కోసం కృష్ణభగవానుణ్ణి ప్రార్థించారు. ఆయన ఆచార్యుడి బలహీనతని పాండవులకు వివరించి, మరు రోజు యుద్ధం ఎలా చెయ్యాలో చెప్పాడు. అనుకొన్న విధంగా ధర్మరాజు "అశ్వథామ హతః కుంజరః" అని అనటం, పాండవ సైన్యం జయభేరులు మ్రోగించటం,  ఆ రణగొణధ్వనిలో ద్రోణాచార్యులు పై వాక్యంలోని చివరి భాగం సరిగ్గా వినకపోవడం, తత్ఫలితంగా ఆయన అస్త్ర సన్యాసం చేయటం, ధృష్టద్యుమ్నుడు ఆయన్ని హతమార్చటం వెంట వెంటనే జరిగిపోయాయి. ధర్మరాజుకి ఇదంతా ఇష్టం లేకపోయినా కృష్ణపరమాత్మకి ఎదురు చెప్పలేక ఆయన చెప్పిన వ్యూహం అమలుచేయటం జరిగింది. తదనంతరం స్వర్గారోహణ పర్వంలో పైపనికి తగిన శిక్ష అనుభవించేడు అన్నది మరో ద్వాపర యుగపు కథ. 

ఈమధ్యన లింక్డీన్.కామ్ (www.linkedin.com) అన్న వెబ్సైటులో మాతో పనిచేసి వెళ్ళిపోయిన ఒక తోటి ఉద్యోగి దరఖాస్తు చూశాను.  ఈ సంస్థ అన్ని రకాల ఉద్యోగులకి క్రొత్త అవకాశాలని చూపెట్టడానికి, ఇతర సంస్థలు ఇక్కడనుంచి కావలసిన వాళ్ళని ఎంచుకోవడానికి అనువైన ప్రదేశం అని ప్రచారం చేసుకొంటుంది. నచ్చిన ఉద్యోగులు వారికి సంబందించిన కొంత సమాచారం ఇక్కడ పొందుపరుస్తారు.  నేను పైన చెప్పినాయన మరోచోట డైరెక్టర్గా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, తెలివైన వాడు, సామర్థ్యం ఉన్న యువకుడు. అంత వరకు తప్పేమి లేదు. అయితే ఉన్న అనుభవమంతా క్రింది స్థాయి నుంచి వచ్చినట్టు కాకుండా, చేరడమే ఉన్నత ఉద్యోగిగా చేరినట్టు వ్రాసాడు. అతను చేరటం ట్రైనీగా  మాతో చేరి త్వరత్వరగా ఉద్యోగంలో ఎదిగాడు.  కానీ అదంతా దాచేసి ఏమి ఎవరికి తెలియనట్టు  క్రొత్త చోట మెట్లుఎక్కాలని చూస్తున్నట్టు తెలిసింది. పరిశీలించి చూస్తే ఈ తత్త్వం బాగా యువతలో వృద్ధి చెందుతున్నట్లు అనిపిస్తోంది. దీని వల్ల నిజంగా అనుభవం, నైపుణ్యమున్నవాడికి నష్టం కాదా? లేని అనుభవంతో సంస్థలో అత్యున్నతస్థానంలో ఉండి వీళ్ళు ఎవరికి ఉపకారం చేయగలరు?

కొన్ని వారాల క్రితం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిగారు ఏదో సందర్భంలో ఉద్యోగాలకి ప్రయత్నించే  ఆశావహులు దరఖాస్తుల్లో కొన్ని లేని హంగుల్ని చేర్చటంలో తప్పులేదని వాక్రుచ్చారు. అది కాస్తా పత్రికల్లో కొంత రాద్ధాంతానికి దారి తీసింది. నిరుద్యోగులు ఏదో ఒక వృత్తిలో చేరటానికి, కుదురుకోవటానికి ఆవిడ స్వతంత్రించి ఇచ్చిన సలహా పనికొస్తుంది. చిత్రమేమిటంటే అన్ని సంస్థలు మనం ఇస్తున్న విషయాలు ప్రమాణపూర్వకముగా నిజమని ధ్రువపత్రాలు తీసుకొంటాయి.  అవి నిజం కానీ పక్షంలో మన ఉద్యోగాలు పీకేయడానికి వాటికి హక్కు ఉంది. చట్టపరంగా నేరం కూడాను. అయినా అలా చేసే వాళ్లకి కొదవలేదు. కారుణ్యదృక్పథంతో చూస్తే నిరుద్యోగులు ఏదో విధంగా జీవితంలో స్థిరపడటంలో పెద్ద అభ్యంతరం కనపడదు. అదే పని కొంత అనుభవమున్న వాళ్ళు చేస్తే అనైతికంగాను, ఎబ్బెట్టుగాను, మోసంగాను అనిపిస్తుంది. ఇది కలియుగంలో కథ (మాయ) ఏమో? 

23 కామెంట్‌లు:

  1. యుగం నుండి యుగానికి దృక్పథం ఎలా మారిందో ఉదహరిస్తూ ఆసక్తికరంగా వ్రాశారు అన్యగామి గారూ.
    చిన్న సవరణ. ద్రోణుడ్ని చంపింది ధృష్టద్యుమ్నుడు అండి, అర్జునుడు కాదు.
    వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి అలా అనకుండా ఉండవలసింది. అసలే విలువలు దిగజారిన ఈనాటి సమాజంలో ఆ అమ్మాయిలాంటి ఉన్నతోద్యోగి మాటలు నిరుద్యోగులకు తప్పుడు సిగ్నల్స్ ఇస్తాయి. అలాగే మీ పాత సహోద్యోగి చేసింది కూడా అనైతికం. మీరన్నట్లు కలియుగ ప్రభావం.

    రిప్లయితొలగించండి
  2. విన్నకోట వారు, తప్పు సరిదిద్దినందుకు ధన్యవాదాలండి. సరిచేసాను. ఆమ్రపాలి గారు కూడా ప్రస్తుత యువతకి దర్పణం అనియే నేననుకొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. సత్యానికి, ధర్మానికి అగ్ర పీఠం మళ్ళీ ఎప్పుడు వేస్తామో? ధన్యవాదాలండి లలిత గారు.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగా చెప్పారు.ఉద్యోగాల వేటలో ఇలాంటివి ఎప్పటినుంచో సహజం అయిపోయాయి.రచయిత ప్రముఖుదే కానె పేరు గుర్తుకు రావటం లేదు.నిజాము కాలం నాటి వాతావరణంలో ఎక్కువ కధలు రాశారు."ఎక్కడయినా కొట్ట్టు,కానీ పొట్ట మీద కొట్టకు!" అని నమ్మేవాదట ఆఖరి నిజాం.అంటే తప్పు చేసినవాణ్ణి ఎలా దండించినా బతుకుతెరువుకి దూరం చెయ్యకూడదు అని అర్ధం!ఇలాంటి నమ్మకాలున్న వ్యక్తి ఇప్పుడు అతను చేశాడని చెబుతున్న ఘోరాలు చేశాడంటే నమ్మడం కష్టమే, ఏది నిజం?ఏది అబద్ధం?

    రిప్లయితొలగించండి
  5. మీరన్నది నిజం. చరిత్ర సరిగ్గా గ్రంథస్తంకాకపోవటం, అధికారంలో ఉన్నవాళ్లు నచ్చినట్టు మార్చుకోవటం, గతం తాలూకు ఛాయలన్నీచెరిపేయటం వల్ల ఏది నిజమో తెలిసేఅవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ధన్యవాదాలు హరిబాబు గారు.

    రిప్లయితొలగించండి
  6. అన్యగామి గారు. బావుంది టపా . ముఖ్యంగా మీరు connect చేసిన తీరు. ఈ resume ల గురించి మాట్లాడితే వ్యాఖ్యలు కాదు. టపాలే వచ్చేస్తాయండీ నాకు. చిన్న చిన్న అబద్ధాలు కూడా కాదు. ఏకంగా పెద్ద పెద్దవే వ్రాసేస్తారు resumeలో :) .


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రిక గారు, మీరన్నట్టు ఈవిషయం మీద ఎంతైనా చర్చించవచ్చు. యేవో కొన్ని అబద్దాలు ఆడి ఒక ఉద్యోగంలో కుదురుకోవటం ఒక ఎత్తైతే, అదే మార్గాన్ని ఆదర్శంగా చేసుకొని మొత్తం ఉద్యోగ జీవితం అంతా అలాగే గడపటం మరో యెత్తు. ముందే అన్నట్టు బిరబిరా ఆ వ్యక్తి అన్ని మెట్లు ఎక్కేసి అందరి మీద అధికారం చెలాయించి, సొమ్ములు వెనకేసుకోవటం తప్ప ఇతరులకి, సంఘానికి దీంట్లో వీసమెత్తు మేలు లేదు. పైపెచ్చు వీళ్ళు మిగిలిన యువతకి ఆదర్శం. ధన్యవాదాలు.

      తొలగించండి
  7. // “........... ఏది నిజమో తెలిసేఅవకాశాలు సన్నగిల్లుతున్నాయి. “ //

    దాన్నే సోషల్ మీడియా అని కూడా అందురు అన్యగామి గారూ 😀😀.

    హరిబాబు గారు ఉదహరించినదాన్ని హైదరాబాద్ లో ఆఫీసుల్లో విరివిగా వాడతారు - పేట్ పే మత్ మారో సాబ్, పీట్ పే మారో అంటూ. మా జనరల్ మేనేజర్ గారొకాయన అదే మాట అనేవారు (పబ్లిక్ గా కాదనుకోండి) - తప్పు చేసిన వ్యక్తికి తీవ్రమైన శిక్ష వెయ్యి, ఇంక్రిమెంట్లు కోసెయ్, ప్రొమోషన్ వాయిదా వెయ్యి, దూరాలకి ట్రాన్సఫర్ చెయ్యి, కానీ don’t throw him out on the street, his family will suffer అనేవారు మహానుభావుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఇట్లాంటి unnecessary సానుభూతులు‌ చూపించే సర్వీస్ సెక్టార్ గా నిలవాల్సిన ప్రభుత నేడు తలపై కూర్చొని ప్రజల్ని ఆటపట్టిస్తోంది.

      ఓ నలుగుర్ని రోడ్డులో నిలబెడితే కొంత డిసిప్లయిన్ అయినా నిలదొక్కేది.

      జిలేబి

      తొలగించండి
  8. జిలేబి గారూ నలుగురినేం ఖర్మ, అంతకన్నా ఎక్కువ మందినే రోడ్డు మీద నిలబెట్టారు - మా సంస్ధ లో - నేరం యొక్క తీవ్రతను బట్టి, నేరం చేసిన ఉద్యోగి యొక్క ఉద్దేశ్యాలని అంచనా వేసిన దాన్ని బట్టి. నేనుదహరించిన జనరల్ మానేజర్ గారే 400 (నాలుగు) వందల రూపాయల ఫ్రాడ్ చేసిన ఉద్యోగిని డిస్మిస్ చేసారు - అక్కడ చిన్నమొత్తం అన్నది కాదు ముఖ్యం, ఆ ఉద్యోగి యొక్క integrity సందేహాస్పదం అయిందన్న పాయింట్ ముఖ్యం ఆయన అటువంటి నిర్ణయం తీసుకోవడానికి. అందువలన ఏ తప్పు చేసిన ఉద్యోగి చర్యలోని అంతరార్థం bonafide యా లేక malafide యా అన్న అంశం పరిశీలించాలి. దాన్నిబట్టి శిక్ష ఉంటుంది. పదేపదే తప్పు చేస్తున్నా, వార్నింగులని ఖాతరు చెయ్యకుండా ప్రవర్తిస్తున్నా అటువంటి కేసుల పట్ల మరింత సీరియస్ గా పరిగణిస్తారు. అంతేకానీ చిన్న చిన్న aberrations కి కూడా పెద్దపెద్దశిక్షలు విధించి, వీధిన పడెయ్యడం సబబు కాదు అన్నది ఆయన చెప్పిన పాయింట్. అటువంటి విధానాన్ని misplaced “sympathy” అనడం కరక్ట్ కాదని నా మనవి.
    బహుశ నేను వ్రాసిన ముందరి వ్యాఖ్యలో నా భావం అంత స్పష్టంగా వ్యక్తపరచలేకపోయినట్లున్నాను, mea culpa 🙁.

    రిప్లయితొలగించండి
  9. విన్నకోట వారు/ జిలేబి గారు, మీ ఇద్దరి వాదనలు సబబే. శిక్ష మనుషుల్ని మారుస్తుంది అన్నది కొంత వరకే నిజం. బరితెగించిన వాళ్ళు దేనికైనా తెగబడే సంఘటనలు ఎన్ని చూడటం లేదు. చట్టం, న్యాయం అందరికి సమానంగా వర్తించే విధంగా సంఘం వృద్ధి చెందనంత కాలం, వ్యవస్థ మీద నమ్మకం కలగదు. ఆస్థాయిని మనం అందుకోనంత కాలం సామాన్యులు అవస్థల పాలు కాకుండా తప్పించుకోవటం సాధ్యం కాదు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. అన్యగామి గారూ, మీరు "నేనెందుకు చదువుతాను" అనే టపా వ్రాశారని "శోధిని" సంకలనిలో చూపిస్తోంది కానీ మీ బ్లాగ్ లో ఆ టపా కనపడడం లేదే 😕?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంకా వ్రాస్తున్నానండి. డ్రాఫ్ట్ని ప్రివ్యూ చేయబోయి, పబ్లిష్ చేసాను. మీలాంటి పాఠకులతో నేనింకా జాగ్రత్తగా ఉండాలి.

      తొలగించండి


    2. విన్న కోట వారా మజాకా :)
      దీర్ఘదృష్టి గలవారు )

      ద్రాఫ్ట్లు టపా ల ను కూడా అట్టే చదివెయ్య గల విఖ్యాత వ్యాఖ్యాతా శ్రీ :)


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    3. 🙏 జిలేబి గారూ. కానీ నా కళ్ళజోడు హ్రస్వదృష్టిదేనండీ 🤔.

      తొలగించండి

    4. హ్రస్వదృష్టే అంత దీర్ఘమా :)


      జిలేబి

      తొలగించండి
  11. అమ్మయ్య ఇన్నాళ్లకి జిలేబి పద్యంతో కొట్టకుండా అర్థమయ్యే భాషలో మాట్లాడింది. ఉద్యోగం కావాలంటే కొంత బుచికి తప్పదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. హమ్మయ్యా! యిన్నాళ్ఖకి
      బామ్మ జిలేబి యిట పద్య పాదము తోడన్
      క్రుమ్మక యనానిమసుకై
      తెమ్మర వలె పలికెనోయి తేట తెలుగునన్ :)

      బుచికో యమ్మా బుచికీ
      కిచకిచ లాడెన్ జిలేబి కెవ్వనుచునిటన్ :)


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    2. నీ సుత్తి భరించలేక ఉన్నాము జిలేబి

      తొలగించండి


    3. నీ సుత్తి భరించన్ గా
      లే! సకల కళామ తల్లి లేమ! జిలేబీ !
      వేసవి కాలపు యెండై
      కీసర బాసర పదముల కిట్టించితివే :)

      గుండమ్మ
      జిలేబి

      తొలగించండి