1, ఫిబ్రవరి 2017, బుధవారం

సమస్యా నువ్వు పారిపోతావా?

గౌరు గోపాలదాసు గురించి తెలియని వారు ఇంటర్నెట్ తో పరిచయం ఉన్న భారతీయులు తక్కువమంది ఉంటారని నేను అనుకొంటున్నాను. ఆయన ఇస్కాన్ ఇండియా లో ప్రముఖ సభ్యుడు. మొన్న ఏమి తోచక ఆయన ముంబై ఐ ఐ టి విద్యార్థులకు చేసిన ఒక ప్రసంగం యూట్యూబ్ లో విన్నాను.  ప్రసంగం పేరు "అద్బుతమైన జీవిత రహస్యాలు - పది బంగారు సూత్రాలు". ప్రసంగమంతా నేటి యువతరాన్ని ఆకట్టుకొనే విధంగా, వాళ్ళ ఆశల్ని, కోరికల్ని భంగపరచకుండా, వాళ్ళ అసాధ్యాలని సుసాధ్యాలు చేసుకోవటం ఎలా అన్నది, నవతరానికి కావలసిన అన్ని రకాల హాస్యంతో కూడిన ఉదాహరణలతో రంగరించి,  గొప్ప ఆధ్యాత్మిక విషయాలను మేళవించి, హిందీ ఇంగ్లిష్ లలో అనర్గళంగా రెండు గంటల పాటు సాగింది. 

ప్రసంగంలో పది ఇంగ్లిష్ పదాలు, వాటి వివరణ, వాటిని ఎలా వాడుకొంటే మనకి జీవితం సఫలం కాగలదన్నది వివరించారు. ఇది అన్ని వయస్సుల వారికి, అన్ని సమయాలలోను పనికివచ్చే సూత్రాలు. దాంట్లోనే ఒకచోట ఒక పదవివరణ కోసం (క్లుప్తంగా చింతకి దూరంగా ఎలా ఉండాలి అన్న సంగతి), ఒక ఫ్లోచార్టును వాడారు. ఫ్లోచార్ట్ అన్నది సైన్స్, ఇంజనీరింగ్ రంగాలలో ఏదైనా కఠినమైన విషయాన్నీ విడమర్చి చెప్పటానికి, సులభంగా అర్థం అవ్వడానికి తరచూ వాడతారు. అది నన్ను బాగా ఆకట్టుకొంది. మీక్కూడా నచ్చుతుందని, దాన్నీనాకు తోచిన విధంగా తెలుగులోకి తర్జుమాచేసి ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇది ఆచరణలో ఆయన చెప్పినంత సులువు కాదు.  అయినాకానీ సమస్యా నువ్వు పారిపోతావా? లేదా? అని అనగలిగే ధైర్యం వస్తుందేమో అని ఈ ప్రయత్నం. 


2 కామెంట్‌లు:



  1. తెలియ పరిష్కారంబును
    సలుపుము కార్యము జిలేబి చకచక యనగన్
    తెలియక బోవ పరిష్కృతి
    యలవోకగ మరిచి బోయి యత్నము విడుమా :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబిగారు, మంచి మాట. అసలు ఏరకమైన మార్గం కానరాకపోతే వదిలేయమని. ఏమాత్రం వీలున్న ప్రయత్నం చెయ్యాల్సిందే. మీకు సరిగ్గా చెప్పలేకపోవటం నా దోషమే. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి